మా మేనమామ జగన్ మామయ్యా హ్యపీ బర్త్ డే, మా నాన్న పేద రైతు కావడం వల్ల మమ్మల్ని చదివించడం ఇబ్బందిగా ఉండేది, మీరు సీఎం అయి అమ్మ ఒడి ద్వారా ఆదుకున్నారు అని చింతపల్లి ధారామణి, ఆశ్రమ పాఠశాల గిరిజన విద్యార్ధిని తెలిపారు. నేనే కాదు నాలాగా వేలమంది విద్యార్ధులు చదువుతున్నారంటే అమ్మ ఒడి కారణం, ఒకప్పుడు మా స్కూల్ సరిగా లేదు మా జగన్ మామయ్య సీఎం అయిన తర్వాత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి, మా గిరిజన విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం సార్, మాకు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, నాకు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడేదాన్ని, నేను ఇప్పుడు ఇంగ్లీష్‌లో చక్కగా మాట్లాడుతున్నాను, బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్ చాలా బావున్నాయి, గతంలో స్కూల్‌కు వెళ్ళాలంటే ఇష్టం ఉండేది కాదు కానీ జగన్ మామయ్య సీఎం అవగానే అన్నీ కూడా ఇస్తున్నారు, జగన్ మామయ్య మా గిరిజన బిడ్డలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారు, మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు, రోజుకోరకం మంచి ఆహారం ఇస్తున్నారు, మాకు మంచి ట్యాబ్‌లు ఇస్తున్నారు, ఐఎఫ్‌పీలు ఏర్పాటుచేశారు, మేం చక్కగా చదువుకుంటున్నాం, ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా టాపర్స్‌కు ప్రోత్సాహకం ఇస్తున్నారు, మేం బాగా చదువుకుని మంచి జాబ్ వచ్చేవరకూ మీరే మాకు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను మామయ్యా, ధ్యాంక్యూ అని తెలిపింది.