డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ. 80 కోట్లు విడుదల చేసింది.
అలాగే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ల గరిష్ట వయో పరిమితి 62 ఏళ్లకు పెంచింది. 62 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ వర్కర్లకు రూ.1 లక్ష, హెల్పర్‌లకు రూ.40,000 వేలు సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది.