ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధాప్యం వలన సింహం మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 03:07 PM

శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయసు 23 సంవత్సరాలని, వృద్ధాప్యం కారణంగా మృతిచెందినట్లు క్యూరేటర్ సెల్వం వెల్లడించారు. ఇటీవల జన్యు సంబంధిత కారణాలతో అనురాగ్ అనే సింహం మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస సింహాల మరణాల నేపథ్యంలో జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాగా నాలుగు రోజుల క్రితం ఆదివారం ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అనురాగ్‌ అనే మగ సింహం (7) మృతి చెందింది. ఏడేళ్ల క్రితం జూ పార్క్ లోనే మూడు సింహాలు పుట్టాయి. ఆ 3 సింహల్లో ఒకటైన మగ సింహానికి అనురాగ్ అనే పెట్టారు. ఇది పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతోంది. వయసుకు తగ్గ బరువు, పొడవు లేకపోవడం, కుడి కంటి చూపు కోల్పోవడం, ఇతర అనారోగ్య సమస్యల వల్ల దాన్ని ప్రదర్శనకు ఉంచలేదని జూ అధికారులు పేర్కొన్నారు. చిన్నతనం నుంచి వైద్య సేవలను జూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్నా కోలుకోలేక పోయిందని చెప్పారు. సాధార‌ణంగా సింహాలు 15-20 ఏళ్లు జీవిస్తాయని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com