కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కట్టడి చర్యలపై సిఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైద్య శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. జె.ఎన్-1పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆస్పత్రికి వెళ్లకుండానే కోలుకుంటున్నారని అధికారులు చెప్పారు.
అయితే శబరిమలకు వెళ్లి వచ్చిన భక్తులు, తిరుమల వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో జనం రద్దీ వల్ల కోవిడ్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.