ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు సూచించింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు ఈ రోజు ఉదయం లిఖితపూర్వక వాదనలను కోర్టులో దాఖలు చేశారు. మధ్యాహ్నం సీఐడీ తరపున లిఖితపూర్వక వాదనలను కోర్టుకు అందించినట్లు సీఐడీ తరపు న్యాయవాదులు తెలిపారు. ఇరు పక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa