కోవిడ్ కొత్త వేరియంట్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని అధికారులు వెల్లడించారు. కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం వైయస్.జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ముందస్తు చర్యలపై దృష్టిపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.