జాతీయ గణిత దినోత్సవం, గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు రేపల్లె పట్టణంలోని రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రామానుజన్ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ అపర్ణ పూలమాలవేసి నివాళలర్పించారు. నేటి పోటీ ప్రపంచంలో మాథెమాటిక్స్కి ఉన్నటువంటి విలువ ప్రాముఖ్యత గురించి విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అవసరమని అవర్ణ పేర్కొన్నారు.