ఏపీలో ఫార్మెటివ్-3 పరీక్షలను జనవరి 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. 1-8 తరగతుల విద్యార్థులకు తరగతి ఆధారిత మదింపు పరీక్ష, 9, 10 తరగతులకు ఫార్మెటివ్-3 పరీక్షలు నిర్వహించనున్నారు.
అలాగే 1-5 తరగతులకు 23 నుంచి 27 వరకు, 6-10 తరగతులకు 29 వరకు పరీక్షలు జరగనున్నాయి.