జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో క్రిస్ట్మస్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. చెన్నకేశవరావు క్రిస్ట్మస్ కటింగ్ చేసి వేడుకలను ప్రారంభించి హేపీ క్రిస్ట్మస్ మేరీ క్రిస్ట్మస్ గ్రీటింగ్స్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కె. బాలమాన్ సింగ్, పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు అలజంగి విక్టర్ సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.