మాడుగుల మండలంలోని రెండో మేజర్ పంచాయతీ కేజీపురం జంక్షన్లో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి పుణ్యదినాన్ని పురస్కరించుకొని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యహ్నాం 12 గంటల నుండి అన్నసమారాధన జరుగును. సాయంత్రం 6 గంటల నుండి సహస్రదీపాలంకరణ పూజ జరుగును. రాత్రి 7 గంటల నుండి భజన కార్యక్రమము జరుగును.