నగరం మండలం కొలగాని వారి పాలెం గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీరామ మందిరంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు శనివారం భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.