విశాఖలోని జూపార్కు తీరంలో మత్స్యకారుల వలకు శనివారం వెరైటీ చేపలు చిక్కాయి. అందులో ఒకటి తిమురు చేప. దీన్ని పట్టుకుంటే షాక్ కొడుతుంది.
సముద్రం పెద్ద జీవుల బారి నుంచి రక్షించుకునేందుకు ఈ చేప షాక్ కొట్టేలా కరెంటు ఉత్పత్తి చేస్తుంది. అందుకే దీన్ని ‘ఎలక్ట్రిక్ రే’ అని పిలుస్తారు. మరో చేప ‘పప్పర్ ఫిష్’. స్థానిక మత్స్యకారులు ‘సముద్ర కప్ప’గా పిలుస్తారు. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఇలా బెలూన్ లా ఉబ్బింది.