యూట్యూబ్ వీడియో చూసి 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా యూపీలో వెలుగులోకి వచ్చింది. హమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
నిఖిల్ సాహూ అనే ఆరో తరగతి విద్యార్థి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేస్ టూ డై అనే వీడియో చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడిది ఆత్మహత్య అన్న విషయం పోస్ట్‌మార్టంలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే, బాలుడి సూసైడ్‌కు కారణాలు ఇంకా తెలియలేదు.