పోక్సో కేసు కింద యువకుడిని అరెస్టు చేసినట్లు పరవాడ డీఎస్పీ సత్యనారాయణ శనివారం తెలిపారు. అచ్చుతాపురం మండలానికి చెందిన ఒక బాలికను ప్రేమించి శారీరక సంబంధం
పెట్టుకున్న ఎలమంచిలి మండలానికి చెందిన కల్యాణ్ కుమార్ (21) పై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.