కోసిగలో రంగప్ప గట్టు శివార్లలో వెలిసిన పెండేకంటి వారి ఆరాధ్య దైవం శ్రీ అంజినేయస్వామికి కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ ఈరన్న, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు నరసింహులు, నాడిగేని నాగరాజుతో కలిసి కోసిగి మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి రూ. 10 వేలు విరాళంగా అందజేశారు.