ఉరవకొండ మండలంలోని చిన్నముస్టూరు, ఉరవకొండ తదితర ప్రాంతాలకు చెందిన ఆంజనేయస్వామి మాలధారులు పాదయాత్రగా శనివారం కసాపురానికి బయలుదేరారు. ఉరవకొండలోని పార్కు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించిన అనంతరం మాలధారులు ఇరుముడితో పాదయాత్ర ప్రారంభించారు. మాలధారులకు వివిధ గ్రామాల్లో స్వాగతం పలికారు. దాదాపు 41 రోజుల పాటు కఠోర మండల దీక్షలు చేసి ఇరుమూడులు కట్టుకొని కసాపురానికి బయలుదేరారు.