ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డుకు చెందిన చింతోటి రాజేష్, మేకల సుచిత్ర, ఎర్రమాస్ దినకర్, పొట్టిపాటి బ్యూలా దంపతులకు వైఎస్సార్ పెళ్లి కానుక పథకం ద్వారా రూ. లక్ష చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని దంపతులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం అందించారు. కార్యక్రమంలో పోరెడ్డి నరసింహారెడ్డి, వార్డు కౌన్సిలర్ పందిటి సరోజమ్మ, తదితరులు పాల్గొన్నారు.