సోంపేట మండల పరిధి బారువా సముద్ర తీరం ఆదివారం యాత్రికులతో సందడిగా మారింది. ఉదయం నుంచి పరిసర ప్రాంత వాసులు కుటుంబాలతో సహా తీరానికి చేరుకుని మధ్యాహ్నం భోజనాలు చేసిన అనంతరం ఆటపాటలతో గడిపి సాయంత్రం సముద్ర స్నానాలను ఆచరించారు. సుమారు 2000 మంది వరకు యాత్రికులు బారువ తీరాన్ని సందర్శించినట్లు మెరైన్ సీఐ రమేష్ కుమార్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.