ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి పెండింగ్ బకాయిలతో పాటు తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను చూసేది లేదని, EHS కింద కూడా వైద్య సేవలు అందించలేమని స్పష్టం చేసింది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ నిరసన కొనసాగిస్తామని తెలిపింది.