తమిళనాడులో గ్యాస్‌లీక్ ఘటన కలకలం రేపింది. ఎన్నూరులో సబ్ సీ పైపులో అమ్మోనియా గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. గ్యాస్ లీకేజీతో సంఘటనా స్థలంలో దుర్వాసన రావడంతో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవడి జాయింట్ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు.