కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘విజయ్‌కాంత్ మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారు’’ అని ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు విజయ్‌కాంత్ (71) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆస్రత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న అప్పటి మద్రాసులో జన్మించారు. 1990లో ప్రేమలతను వివాహమాడారు. సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా రాణించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తా చాటారు.