టీడీపీకి కుప్పం నియోజకవర్గం కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘టీడీపీ హయాంలోనే కుప్పం అభివృద్ధి జరిగింది. కుప్పం ప్రాంతానికి ఏం చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదు. దోపిడీ.. గజ దొంగలు.. రాష్ట్రాన్ని దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారు’’ అని మండిపడ్డారు.