తిరుమల మెట్ల మార్గంలో మరో సారి చిరుత కదలికలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తున్నట్టు తెలుసుకున్నారు.ప్రముఖ దేవస్థానం తిరుమలలో మరో సారి చిరుతల అలజడి కలకలం రేకెత్తిస్తోంది. అలిపిరి నడక మార్గంలో వారి సారి చిరుత కదలికలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తున్నట్టు తెలిసింది. గతంలో చిన్నారి లక్షితపై చిరుత పులి దాడి చేసిన ప్రాంతంలో వాటి కదలికలు ఉన్నట్టు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ఈ నెల 13, 26వ తేదీల్లో చిరుత, ఎలుగుబంటి సంచారం అందులో కనిపించింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తం అయ్యింది. నడక మార్గంలో వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భక్తులు ఒంటరిగా కాకుండా, గుంపులు గుంపులుగా రావాలని కోరింది.