ప్రధాని మోదీకి జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ రాయడంపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. "ఇళ్ల స్థలాల్లో రూ.35 వేల కోట్ల స్కాం జరిగిందనడానికి ఆధారాలు చూపిస్తావా పవన్.
ప్రధానికి లేఖ రాసిన పవన్‌ను అవినీతి ఎలా జరిగిందని అడిగితే తింగరిముఖం వేసుకుని చూడాలి. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నాడు." అని ఆయన వ్యాఖ్యానించారు.