ధర్మవరం పట్టణంలో వెలసి కొలువైన శ్రీ దుర్గమప్ప, వారాదయ్య స్వామి భక్తుల చేత విశేష పూజలు అందుకుంటుంది. అయితే ఈ ఆలయం 155 సంవత్సరాల కాలం నాటి పురాతన ఆలయమని గుడికట్టు పూజారులు, గ్రామ పెద్దలు, కాపు పూజారులు సోమవార తెలిపారు. వందల సంవత్సరాల నాటి ఆలయం పాతబడిపోవడంతో కొత్త ఆలయం నిర్మాణం చేసేందుకు వేద పండితుల ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు.