రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. గోవిందు డిమాండ్ చేశారు. ఆదివారం గుంతకల్లు పట్టణంలోని బిటి. పక్కీరప్ప భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడి వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని 21 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గమన్నారు. వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.