మంగళవారం మండల పరిధిలోని కాజీ పాలెం గ్రామ సచివాలయం నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంపీడీవో భవనం శేషమాంబ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు కోన రఘుపతి విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున ప్రజలు లబ్ధి దారులు పాల్గొని ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa