ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్ 31న మద్యం విక్రయాల్లో ఏపీ రికార్డు.. తొలిసారి తెలంగాణ కంటే ఎక్కువ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 09:02 PM

న్యూ ఇయర్ వేడుకల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. రికార్డు స్థాయిలో అమ్మకాలతో ప్రభుత్వాలకు భారీగానే ఆదాయం సమకూరింది. అయితే.. ఎప్పుడూ మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు సృష్టిస్తుంటే.. ఈసారి మాత్రం ఏపీ సత్తా చూపించింది. తెలంగాణ కంటే.. తాము కూడా ఎక్కువ మందు తాగుతామని ఏపీ మందుబాబులు నిరూపించారు. డిసెంబరు 31 ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 156.60 కోట్ల మద్యం విక్రయాలు జరిగనట్లు ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. 1.51 లక్షల కేసుల మద్యం, 67 వేల కేసుల బీర్లు విక్రయించినట్టు వివరించారు.


అయితే.. తెలంగాణలో డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో ఏకంగా రూ.658 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడైంది. మూడు రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేస్లు, 6.31 లక్షల బీర్ కేస్లు అమ్ముడయ్యాయి. ఇందులో.. డిసెంబర్ 31వ తేదీన 127 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరినట్టు తెలంగాణ ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. డిసెంబర్ 31 కంటే ముందు రోజైన 30వ తేదీనే రూ.313 కోట్ల లిక్కర్ సేల్ కావడం గమనార్హం. అంటే.. పార్టీ కంటే ఒక రోజు ముందుగానే సరంజామా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.


2023 డిసెంబర్ నెల 31 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 274 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అందులో ఒక్క డిసెంబర్ నెలలోనే ఏకంగా రూ.658 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగటం గమనార్హం. 2022 డిసెంబర్ నెల రికార్డును.. 2023 డిసెంబర్ నెల తిరగరాసింది. అమ్మకాలు ఏకంగా 26 శాతం పెరిగాయి. ఇందులో విస్కీ, బ్రాందీ, చీప్ లిక్కర్ వంటివి 33 శాతం అమ్మకాలు పెరగగా.. బీర్లు మాత్రం 16 శాతం పెరిగాయి. ఇదంతా కేవలం గత డిసెంబర్.. ఈ డిసెంబర్ నెల మధ్య తేడానే కావటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa