రైల్వే కోడూరులో బుధవారం జరిగిన సామాజిక సాధికారిక బస్ యాత్ర విజయవంతంపై ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రైల్వే కోడూరు వైసిపి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలను అందించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. తనపై అత్యంత ప్రేమ, అభిమానం ఉందనేది సామాజిక యాత్ర ద్వారా మరోసారి నిరూపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.