జగన్ ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ఏమీ చేయలేదని, శంకుస్థాపనలు రిబ్బన్ కటింగ్ తప్ప ఎక్కడ గాని నూతన ఫ్యాక్టరీలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ మక్బూల్ బాషా అన్నారు. గురువారం కడప పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి మేలు జరగలేదన్నారు.