వచ్చే ఏడాది ఫిబ్రవరిలో (8న పోలింగ్–కౌంటింగ్ సోదర దేశమైన పాకిస్తాన్ సాధారణ ఎన్నికలు జరగనుండగా, జనవరి 7న మరో భారత ఉపఖండ దేశం బంగ్లాదేశ్ పార్లమెంటు (సన్సద్) ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు, ఇంకా పాకిస్తాన్, నేషనల్ అసెంబ్లీ, వివిధ ప్రావిన్సుల చట్టసభల ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కంపు ఒకే రోజు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. అమెరికాలో సైతం అధ్యక్ష ఎన్నికలు, వాటితోపాటు జరిగే ఇతర పదవులకు ఎన్నికలు ప్రతి లీప్ సంవత్సరం నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు పోలింగ్ తర్వాత ఎప్పుడనేది ఆయా దేశాల ఎన్నికల చట్టాల నిబంధనలను బట్టి ఉంటుంది. అయితే, ఏ దేశంలోనైనా పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటిస్తేనే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బలపడుతోంది అని విజయ్ సాయిరెడ్డి వ్యక్తపరిచారు. అయన మాట్లాడుతూ.... ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, ఓట్ల లెక్కింపు పద్ధతుల ఆధునికీకరణ వంటి పరిణామాల ఫలితంగా ప్రస్తుతం పోలింగ్ రోజే కౌంటింగ్ చేపట్టడం చాలా తేలిక అయింది. ఒకే దశలో పోలింగ్ జరిగినప్పుడు మాత్రమే ఎన్నికల రోజే ఓట్ల లెక్కింపు మొదలుబెట్టడం సాధ్యమౌతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పంథాలో నడిచే దేశాల్లో ఒకే రోజు పోలింగ్ జరిగే దేశాల్లో ఎన్నికలు పూర్తయిన మరు క్షణమే ఓట్ల లెక్కింపు మొదలుబెట్టే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పోలింగ్ జరిగిన వెంటనే ఓట్ల లెక్కింపు ఆరంభించపోతే ఆ తర్వాత వెలుబడే ఎన్నికల ఫలితాలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసే ప్రమాదం ఉంటుందనే మాట పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు బాగా వినబడుతోంది. అయితే, 142 కోట్ల జనాభా, దాదాపు నూరు కోట్ల ఓటర్లు ఉన్న ఇండియాలో అమెరికా, పాక్, బంగ్లాదేశ్‌లో మాదిరిగా ఓకే రోజు పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించడం సాధ్యం కాదనేది తిరుగులేని వాస్తవం అని అన్నారు.