రాష్ట్రంలో పేద వర్గాల పక్షాన నిలబడింది సీఎం వైయస్ జగన్ ఒక్కరేనని, ప్రతి సంక్షేమ పథకం లబ్ధిని పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందజేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఈ వర్గాల వారిని అందలం ఎక్కించిన జగన్కు మధ్య పాలనను బేరీజు వేసుకుని, వచ్చి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేలును చూసి చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఓర్చుకోలేక, నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.