టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ‘‘చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను’’ అని నాని ఎక్స్ వేదికగా తెలిపారు.