పెనుకొండ సమస్యల పరిష్కారం కోసం నగర పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజు ఆదివారం కొనసాగింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్, మండల కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ యూనియన్ చిన్న వెంకటేష్, రిక్షా నరసింహులు, ముత్యాలు, నరసింహప్ప, తిప్పన్న, లక్ష్మీదేవి, వెంకటేష్ పాల్గొన్నారు.