టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో కీలక ప్రకటన చేశారు. తన కూతురు శ్వేత కార్పొరేటర్ పదవితో పాటు.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలిపారు.
ఉదయం 10.30కి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శ్వేత తన రాజీనామా లేఖను అందజేస్తారని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కాగా.. కేశినేని నాని తన ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.