కళ్యాణదుర్గం పట్టణంలో వైసిపి నాయకులు సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎంపీ తలారి రంగయ్య అనంతపురం పట్టణం అభివృద్ధి కోసం మొట్టమొదటి ఎంపీ జీతం జిల్లా కలెక్టర్ కి అందించారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఆస్పత్రులలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారన్నారు. పంటలు పండిచ్చే రైతుల కోసం కనీవినీ ఎరుగని రీతిలో అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైలు ఏర్పాటు చేశారన్నారు.