అమెరికాకు చెందిన ఓ దంపతులు తమకున్న గణిత నైపుణ్యాలు, తెలివితేటలతో లాటరీల ద్వారా 26 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.200) సంపాదించారు. జెర్రీ (80), మార్జ్ సెల్బీ (81) 60 ఏళ్లు వచ్చే వరకూ ఒక కన్వీనియన్స్ స్టోర్‌ను నడిపి.. తర్వాద దానిని విక్రయించారు. అయితే, 2003లో విన్‌ఫాల్ అనే కొత్త లాటరీ గేమ్ కోసం విడుదలైన బ్రోచర్‌వారిని ఆకర్షించింది. అందులో దాదాపు గెలుపొందడానికి అవకాశం ఉందని సెల్బీ గ్రహించాడు. విన్‌ఫాల్ లాటరీలో జాక్‌పాట్ 5 మిలియన్ డాలర్లకు ($7 మిలియన్లు) చేరుకున్నాక నిలుపుదల చేయకుంటే ఎక్కువ టిక్కెట్ కొనుగోలుచేసిన వ్యక్తులకు ప్రయోజనం కలుగుతుంది.
అంటే, పెద్ద సంఖ్యలో టిక్కెట్లు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా లాటరీ గెలుస్తుందని అర్థం. తనకున్న గణిత ప్రావీణ్యంతో 1,100 డాలర్లు పెట్టి 1,100 టిక్కెట్‌లను కొనుగోలు చేస్తే 1,900 డాలర్లు సంపాదించవచ్చని అంచనా వేశాడు. దీనిపై సెల్బీ మాట్లాడుతూ.. ‘నేను లాటరీలో అసమానతలను చూశాను.. రిస్క్-రివార్డ్ విశ్లేషించి.. ఆ గేమ్ లాభదాయకంగా ఉంటుందని గుర్తించడానికి నాకు రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పట్టింది’ అని అతను తెలిపాడు. ఇక, వృద్ద జంట ప్రయోగాత్మకంగా తొలుత 3,600 డాలర్లు విన్‌ఫాల్ టిక్కెట్‌లలో పెట్టుబడి పెట్టి, దాదాపు 6,300 డాలర్లు గెలిచారు. ఆ తర్వాత 8,000 డాలర్లు వెచ్చిస్తే... దానికి రెట్టింపు వచ్చింది. ‘ఒకవేళ నేను 1,100 డాలర్లతో గేమ్ అడితే.. గణితశాస్త్రపరంగా నాలుగు-సంఖ్యల అంటే 1000 బక్స్ గెలుస్తాను.. నేను 1,100ని 57కి బదులుగా ఆరుతో భాగించాను.. 18 లేదా 19 మూడు సంఖ్యలు విజేతలుగా ఉంటారని ఊహించాను... అందుకే నేను 1,100 పెట్టుబడి పెడితే.. నాకు 1,900 డాలర్ల రాబడి వచ్చింది’ అని చెప్పాడు.
చివరికి గేమ్‌లో చాలా నైపుణ్యం సాధించిన ఈ దంపతులు.. జీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఒక్కొక్కటి 500 డాలర్లు చొప్పున టిక్కెట్‌లు కొనుగోలు చేయమని ప్రోత్సహించారు. అలాగే, మసాచుసెట్స్‌లో విన్‌ఫాల్ లాటరీ గురించి తెలుసుకుని అక్కడకు ప్రతిసారీ వెళ్లి తమకు అనుకూలమైన రెండు దుకాణాలలో వందల వేల టిక్కెట్‌లను కొనుగోలు చేశారు. విన్‌ఫాల్‌తో ఆడిన తొమ్మిదేళ్లలో తమ బృందం మొత్తం 26 మిలియన్ డాలర్లు గెలుచుకుందని సెల్బీ వివరించారు. పన్నులకు ముందు సుమారు 8 మిలియన్ డాలర్లు లాభం పొందామని చెప్పారు. ఈ డబ్బు తమ కుటుంబం స్థిరపడటానికి ఆరుగురు పిల్లలు, 14 మంది మనవవళ్లు, 10 మంది మనవరాళ్లు చదువుకోడానికి ఉపయోగపడిందని తెలిపారు. వారి విజయాలు, పెద్ద సంఖ్యలో టిక్కెట్‌ల కొనుగోలు చేస్తున్న అంశంపై కూడా ఇన్‌స్పెక్టర్ జనరల్ విచారణను ప్రారంభించింది. అయితే, నిబంధనల ప్రకారం ఆడుతున్నారని, చట్టవిరుద్ధం ఏమీ లేదని తేలింది.