కనిగిరి పట్టణ ప్రజలకు విద్యుత్ సమస్య తలెత్తుకుండా అన్ని విధాల చర్యలు తీసుకుoటున్నట్లు మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. సోమవారం13వ వార్డులో కనిగిరి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ కమిషనర్ నారాయణ రావు పర్యటించారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు శిధిలా వ్యవస్థకు చేరాయని వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ తెలిపారు.