కంబదూరు మండలం కొత్తపల్లిలో ఎరుకుల తిమ్మప్ప రైతు పొలంలో సాగుచేసిన దానిమ్మ పంటను జిల్లా ఉద్యానవన అధికారి రఘునాథ రెడ్డి మంగళవారం పరిశీలించారు. దానిమ్మ పంట దిగుబడి పట్ల, యాజమాన్య పద్ధతుల పట్ల రైతుకు ఆయన అవగాహన కల్పించారు. దానిమ్మ పంట దిగుబడిని సాధించే క్రమంలో పంట స్థాయిని బట్టి ఏ రకమైన ఎరువులు, మందులు వాడాలి, ఎంత మోతాదులో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వదలాలి తదితర అంశాల పట్ల ఆయన క్షుణ్ణంగా విశదీకరించారు.