అవినీతికి సహకరించే అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎర్రగడ్డకు పంపించటానికి జగన్ అర్హుడు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ వై నాట్ 175 అంటుంటే ప్రజలు వైనాట్ 5 అంటున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే రాజమండ్రి సిటీ నుంచి గాని రాజమండ్రి రూరల్ నుంచి గాని పోటీ చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నా చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.