ఉత్తరప్రదేశ్లోని కాన్పూరులో అమానవీయ ఘటన జరిగింది. ఎంసీఏ విద్యార్థి ఆయుష్ ద్వివేది (23) తన స్నేహితుడితో కలిసి ఓ స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో హెడ్ కానిస్టేబుల్ సహా డజనుమంది దుండగులు తుపాకి గురిపెట్టి కిడ్నాప్ చేశారు.
అనంతరం ఒకరితర్వాత ఒకరు అతడి నోట్లో మూత్రం పోసి తాగించారు. అంతటితో ఆగక చెప్పులపై ఉమ్మివేసి నాకించారు. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.