అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్త అమలిజా నావ్స్ (78) అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయాన్ని ట్రంప్ భార్య, మెలానియా ట్రంప్ X ద్వారా తెలిపారు.
తన మాతృమూర్తిని కోల్పోవడం పట్ల ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఎల్లప్పుడూ కరుణ, దయ, గౌరవంతో ముందుకు సాగారని, పూర్తిగా తన జీవితాన్ని కుటుంబానికే అంకితం చేశారని, ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తామని మెలానియా ట్రంప్ పేర్కొన్నారు.