ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బుధవారం ఆరోపించారు. పటేల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 'మై భీ కేజ్రీవాల్' ప్రచారం కింద నిర్వహించిన ఆప్ 'జన్ సంవాద్'లో మంత్రి ఈ ప్రకటన చేశారు. ఢిల్లీ, పంజాబ్‌ల సేవ కోసం చేసిన ప్రతి హామీని అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే నెరవేర్చారు.. ఆయన మాత్రమే అలా చేయగలరు. 2 కోట్ల ఉద్యోగాలు, అందరి ఖాతాల్లో రూ. 15 లక్షల హామీ అయినా బీజేపీ చేసిన ప్రతి హామీ అబద్ధం.. బీజేపీ ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఢిల్లీ ప్రజలను, దేశాన్ని మోసం చేసింది అని తెలిపారు.