ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బుధవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ...మార్పులు అనేది రాజకీయ ప్రక్రియ అని.. ఎన్నికల సమయంలో సర్వ సాధారణంగా జరుగుతూనే ఉంటాయని తెలిపారు. తనను మండపేట నుంచే జగన్ పోటీ చేయమన్నారని...తాను మండపేట నుంచే పోటీ చేస్తున్నానని తెలిపారు. ఎవరి అవసరం ఎక్కడ ఉందో అక్కడికి జగన్ మారుస్తున్నారన్నారు. కాపుల కోసం పవన్ కళ్యాణ్ వాకిలి ఇప్పుడు తెరిచాడని అంటే ఇప్పటి వరకూ మూసేసినట్టా..? అని ప్రశ్నించారు. ఎవరూ ఒక కులాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేయలేరని తెలిపారు. కులం బలం ఉండొచ్చు కానీ గెలుపును నిర్ణయించలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.