ఏపీలో చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ ఈరోజు విడుదల చేశారు. 3.95 లక్షల మంది ఖాతాల్లో రూ.417.94 కోట్ల వడ్డీ లేని రుణాలు జమ చేశారు.
ఇందులో కొత్త లబ్ధిదారులకు రూ.10 వేలు, పాత వారికి రూ.11 వేలు, రూ.12 వేలు, రూ.13 వేల చొప్పున ఇస్తున్నారు. అలాగే 5.81 లక్షల మందికి రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను జమ చేశారు.