శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం పిఎస్ తాండ గుండుమల గ్రామాలలో దాదాపు 14 బోర్ల వద్ద బుధవారం అర్ధరాత్రి కేబుల్ వైర్లను దుండగులు చోరీ చేశారు. గుండుమల పంచాయతీలో రాత్రికి రాత్రే కేబుల్ వైర్లను దొంగలించినట్లు ఆ గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు నియోజకవర్గంలో దొంగతనాలకు పాల్పడుతున్న దుండగుల వెంటనే పట్టుకుని వారి తగిన శిక్షలు విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.