జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఈనెల 15న నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్. రాధిక తన కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15వ తేదీ సంక్రాంతి పండుగ కావడంతో స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు ఎవరు రావద్దని సూచించారు.