ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలసియున్న శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి వారిని శుక్రవారం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.