ప్రకాశం జిల్లా గిద్దలూరు లో శుక్రవారం వైసీపీకి షాక్ తగిలింది. రాచర్ల మండలం జెపి చెరువుకు చెందిన ఎంపీటీసీ వెంకటేశ్వర్లు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. ఎంపీటీసీ తో పాటు విద్యా కమిటీ చైర్మన్ ఖాసిం వలి, సచివాలయ కన్వీనర్ సిద్ధం నరసింహులు, వార్డ్ మెంబర్ షేక్ బాషా, రంగస్వామి టెంపుల్ కాపు సత్రం ప్రధాన కార్యదర్శి గోపాల్, ఇరిగేషన్ మాజీ చైర్మన్ పుట్ట గురుమూర్తి వారి అనుచరులు వైసీపీని వీడి టిడిపిలో చేరారు.