యాడికి మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్ నూతన సిఐగా బాధ్యతలు చేపట్టిన నాగార్జునరెడ్డిని శుక్రవార వైకాపా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు సీఐని శాలువా, పూల మాలలతో సత్కరించారు. శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, విధులు సక్రమంగా నిర్వర్తించడంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఉపసర్పంచు కాసా చంద్ర మోహన్, ప్రజాప్రతి నిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.